Telugu Lyrics Of Shiridi Sai Chalisa (Shiridi Vasa Sai Prabho)
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
దత్త దిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయి
కరుణించి మము కాపాడోయి
దరిశన మీయగ రావయ్యా
ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడీ||
కఫినీ వస్త్రము ధరియించి
భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలలో
ఫకీరు వేషపు ధారణలో
కలియుగ మందున వెలసితివి
త్యాగం, సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం
భక్తుల మదిలో నీ రూపం ||షిరిడీ||
చాంద్ పాటిల్ ను కలుసుకొని
ఆతని బాధను తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి
పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను
నీవుపయోగించీ జలము
అచ్చెరు వొందెను ఆ గ్రామం
చూసి వింతైనా దృశ్యం ||షిరిడీ||
బాయిజా చేసెను నీ సేవ
ప్రతిఫల మిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి
తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి
ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం
చిత్రమయా నీ వ్యవహారం ||షిరిడీ||
నీ ద్వారములో నిలిచితిమి
నిన్నే నిత్యము కొలిచితిమి
అభయము నిచ్చి బ్రోవుమయా
ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ
నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి
పాపము పోవును తాకిడికి ||షిరిడీ||
ప్రళయకాలము ఆపితివి
భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మరీ నాశనము
కాపాడి షిరిడీ గ్రామము
అగ్ని హోత్రి శాస్త్రికి
లీలా మహాత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి
పాము విషము తొలగించి ||షిరిడీ||
||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||
0 Comments:
Post a Comment